5, జనవరి 2021, మంగళవారం

01.01.2021, నిత్య పద్య ప్రణాళిక - వినాయక జననము

 



మొదటి  అంశము

వినాయక జననము     నలుగు  పిండితో  పార్వతి  ఒక బొమ్మను  చేయుట  దానికి  ప్రాణము పొయుట  వాకిలిలో  కాపలా ఉంచుట  గజాసురుని  సమ్హరించి  శివుడు  కై;లాసమునకు  వచ్చుట   వాకిలిలో  బాలుడు  అడ్డగించుట.  శివుడు  అతని  తల నరుకుట    పార్వతి  బాధను  చూసి  శివుడు  ఓదార్చి  ఏనుగు ముఖమును  శివునికి  అతికించుట  అతనికి  గజాననుడు  అని పేరు పెట్టుట . సుబ్రమణ్య స్వామి పుట్టుట  గణములుకు  అధిపత్యము కొరకు అన్న దమ్ములు తగాదా  పడుట  గజాననుడు గెలుకుట  విఘ్నములకు  అధిపతి అగుట   ఇది   అంశము   మీ  ఇష్ట ము  వచ్చిన ప్రకారము తేట గీతి వ్రాయాలి. 

 

ఇది 2/1/2021 సాయంత్రము లోపు  పంపాలి.  నూతన  సంవత్సరపు వేడౌకల కారణముగా  ఒక రోజు సమయము అధికము గా  ఇచ్చుట జరిగినది.

 

పూసపాటి

 

నిత్య పద్య ప్రణాళిక  01 01 2021 - వినాయక జననం


నలుగు బొమ్మను‌ చేసి యా నంద యంతి

ప్రాణమును బోసి  కాచగా వలయు  ననుచు‌

నానతి నిడగ వాకిట‌ తా నటునిటు

తిరుగు తరుణాన యేతెంచె పరమ శివుడు,

తల్లి యాఙ్ఞ పాటించి‌ ద్వార మందు

నడ్డు నిలిచి నిరోధించె నాగ హారు

నపుడు,కోపము పెరుగంగ నరికి వేసి

బాలుని శిరముచేరెగా భార్య చెంత

త్ర్యంబకుండు సరస గతిన్, తనయుని‌ మృతి

ని వినిన నగజ రోదించ నేర్పు‌ తోడ

గజపు‌ శిర మతికించిశీఘ్రముగ ప్రాణ

ములను బోసి గిరి సుతకు ముదము గూర్చ

గజ వదనుడుగా పెరిగె ననుజుని కూడి,

గణములకు నాయకత్వము కరుణ తోడ

జనకు డిడగ గణపతి గా ఘనత నొంది

విఘ్నములు బాపు చుండెను విశ్వ మందు

పూసపాటి

  

తేటగీతి!! 1

పిండి బొమ్మచేసి హిమజ ప్రీతి తోడ

ప్రాణమును బోసి సుతుడని పరవశించి

గడప యందున కాపలా  కాయుమనగ

శివుని నడ్డగించ కసరి శిరము ద్రుంచ

గజముఖమునొంది లోకాగ్రఘన్యు డయ్యె

 

తేటగీతి !! 2

కార్తికేయుడు నగజాత  గర్భ మందు

జనన మొందియు నన్నతో   జగడ మాడె

ప్రథమ గణములపై నాథి  పత్యమునకు

సుముఖుడును మాత పితల చుట్టు తిరిగి 

విజయుడై గణాధిపతిగ వినుతి కెక్కె.

శూర్పకర్ణుడు =గణపతి

 

ప్రార్థన   3 , తేటగీతి!!

ప్రథమ పూజలు గైకొనే పర్శు పాణి 

పత్రి పుష్పము లర్పించి భక్తితోడ

స్మరణ జేసిన విఘ్నముల్ క్షయము జేసి   

బొజ్జ దేవర స్థిరసిద్ది బుద్ది నొసగు

పర్శుపాణి =గణపతి

గాండ్ల వీరమణి

 

అమ్మ చేతిన పుట్టిన తనయు డతడు

బంటు నాయెను, మాతకు పట్టు బట్టి

పరమ శివునిన డ్డు కొనగ, పరము కోపి

శివుడు శూలము తోడను, తలను త్రుంచ,

గౌరి దుఖము చెందగ గౌరి పతియు

గజము శిరసున తుకగను గజము ఖుడుగ

కొత్త రూపును దాలిచి గొప్ప  దేవ

తల్లి తండ్రుల పరిక్రమ తాను చేసి

సోద రుని,తోడ తలపడి సోము మెచ్చ

నెగ్గి చూపెను గణపతి, నే, రయక

కొలుచు చుందును నిన్నును కోటి  రాగ

ములను  పాడుచు నందరి ముందు  భువిని

 

పుట్టె నలుగున బొమ్మగ బుడత దేవ

శివుడు దృంచగ బాలుని శిరము, గిరిజ

బాధ తీరగ గజముఖ పాప డాయె

ప్రధమ పూజన పొందగ ప్రతి దినమ్ము

విఘ్న హరణను చేయగ, వి ఘ్న రాజ

సాయి లక్ష్మి

 

సుదతి పార్వతి చేసెను సున్ని పిండి

తోడ  ప్రతిమను ద్వార మందుంచె కాపు

దారి వీడని గణపతి తలను ద్రుంచె

చిచ్చు కంటి   నేలకొరిగె చిన్ని శిశువు

గౌరి శోకము దీర్చెను గజముఖమ్ము

నతికి తల్లిదండ్రుల చుట్టు నడచి గెలిచి

గణపతయ్యెను గణనాథు . గారవించె

సకల దేవతల్ ప్రణమిల్లి సంతసముగ

రమ

 

 

శంభు తేజోద్భవంబిల స్కందుడాయె

విజయ నలుగున విభవించె విఘ్నహారి

కృత్తికా క్షీరమున్ గ్రోలి గెలిచెనొకడు

కరి శిరముతో మరిజనించె ఘనుడొకండు

వాణిశ్రీ నైనాల

 

నలుగు బిండితో బొమ్మను నగజ జేసె

నంత ప్రాణము పోసెను సుంత; మూర్తి

నిలిపె వాకిట కాపుగా నెలవు దీర్చ

రాఁగ శివుని నిలువరించె! రామలింగ||1||

 

తనను నిలిపిన బాలుని దునిమె శివుడు

గౌరి కనుగొని దుఃఖించ కఱిమెడదొర

గజముఖమునిడి దీవించె గజముఖునిగ

రాణనొప్పారె గోముగ! రామలింగ!   ||2||

 

ఆధిపత్యము కొరకు తానధికుడనని

స్కంధుడు బలుక - ప్రణమిల్లి జనని జనకు

లకు, గణపతిగ విఖ్యాతి లాభమొంది,

రంభపట్టి కాచె శ్రితుల! రామలింగ!   ||3||

 

తేటగీతి

  నలుగు పిండితో బొమ్మకు నవ్య రీతి

  చేసి ప్రాణము పోసియు  చేర్చె శక్తి

  నీల కంఠుడు యేతెంచ నిలువ రించె

  శివుడు బాలుని యెదిరించి శిరసు ద్రుంచె

 

తేటగీతి

  తనదు పుత్రుని గతిగని తాళ లేక

  తీవ్ర దుఃఖపు తీరును తీర్చు కొరకు

  గజము శిరమును యతికించ గజము ఖుడుగ

  గణము లకధిప తిగమారె కరివదనుడు

 Krishna Sastry

 


నలుగు పిండితోడ వెలిసె నందనుండు

జీవ మొంది నాడు జనని చేతి లోన

తల్లి యానతి మీరక తాను శివుని

యడ్డగించె తనకు తండ్రి యని తెలియక

అర్ధనారీశ్వరుడు జంపె నాగ్రహమున

తల్లి తల్లడిల్లే విగత తనయు గని..

Radhika

 

 

సీసము

తల్లి చేతి నలుగు  తనయుడాయెను ముద్దు  బాలుడు తల్లి ప్రపత్తి కోరి

వాకిట నిలచెను  వలదని శివు నాప  తలదు నమగ యంత   తల్లడిల్లు

భామిని శోకము బాప శివుడు  గజముఖ మిచ్చి భార్యకు ముదము గూర్చి

శిశువు కాచె నతడు, శిఖివాహనుడు జనింప   తనయులు గణాధిపత్యమడుగ

 

తీర్థ యాత్ర చేసి మొదలు తిరిగి రమ్ము

అధిపతియగునని శివుడు యాన తియ్య

సులువున జననీ జనకుల చుట్టి గెలిచి

 విఘ్ణపతియై గజముఖుడు విజయుడాయె

సతీష్

 

తే.గీ.

నగజ మహిమ తెలియ వచ్చె నలుగు తోటి

సుముఖుని సృజించగ. భువనేశుని మహాత్మ్య

ము ప్రకటితమాయె బాలుని ముద్దు తోడ

కరవదనునిగా అమరించి గారవింప!

తే.గీ.

బాలునొకని సృజించెను పార్వతి మురి

పెముగ. నిలిపె వాకిలి చెంత పీధముగ,

పరికర్మముజేయగాను, తన సుతుని.

జనని యానతి మేర నిజమున నిలిచె

నాతడు బిగువుగ, మొగమున దెసగాను.

పోరు సలిపెనాతడు, లోన పోవగ దరి

జేరిన శివుని తోడ నంజిలిబడక.

సువులు బాసె నాతడు శూలి శూలము తల

త్రుంచగాను. సుతునిజూచి దుర్గ నొగులు

జెందగ, గజ ముఖము కదించి శివుడు మర

బ్రతికించి, ప్రియముగ బాల గణపతిగ

వర్ధిలుమనగ, తృప్తిగా భార్గవలరె!

Gourinandan

 

తేటగీతి

పిండి తోముద్దు బాలుని పింగ చేసె

ఉసురు బోసితా నిల్పెగ  యూతి నివ్వ

ఫాలనేత్రుడి రాకతో పరశుధరుడు

అడ్డగించగ నిల్చెను యమ్మ కొరకు

శివుడు కోపము తోడగ శిరము నరికె

తనయుడిని జూసి నగజాత తల్లడిల్లె

 గజము ముఖమతికించెను గౌరి పతియె

విఘ్నములకదిపతి యయ్యె  విఘ్నరాజు

 

పింగ-పార్వతి,   ఊతి-రక్షణ,   ఫాలనేత్రుడు-శివుడు,   పరశుధరుడువినాయకుడు,   నగజాత - పార్వతి

సి హెచ్  రజిత

 

 

పిండి బొమ్మను చేసెను ప్రేమ మీర

కాప లానుంచె వాకిట కనక దుర్గ

సాంబు డేతెంచె నసురుని సంహరించి

బాలు డడ్డగించంగనా పరమ శివుడు

త్రుంచి వేసెను బాలుని దోర శిరము

క్రుంగి పోయెను పార్వతి కొడుకుఁ జూచి

గజపు శిరమునమర్చగ కరుణ తోడ

తల్లి దండ్రుల పూజించి తమ్ముఁగెలిచి

దేవ గణముల కధిపగ దివ్యముగను

గణపతిగ విఘ్నపతిగను గణుతికెక్కె

ఆదిభట్ల సత్యనారాయణ

 

తే.గీ

వచ్చు వారిని నిలుపంగ  వాకిటందె

నలుగు బొమ్మకు ప్రాణమె నగజబోసె

అడ్డ గించెను బాలుండు యక్షతుడినె

భర్గుడుగ్రుడై ఖండించె భవ్య సుతుని!

 

తే.గీ

సుతుని జూడగ శైలజ శోక మొంద

గజముఖమతికి బ్రతికించె గంగధరుడు

విఘ్న పతిజేసె బాలుని విశ్వమునకు

ప్రధమ పూజకు గణపతే ప్రభువు నిలన!

నీరజ

 

 శివుని చింతన జేయుచు శిఖర వాసి

జేసి బొమ్మ పసుపు తోడ, జేర్చె ద్వార

మందు కాపుగ. పార్వతి మాట మేర

బాలుడు నిలువరించెను భవుని. కినుక

చెంది ముక్కంటి ఖండించె శిశువు శిరము

గతము తెలిసి పంచముఖుడు గజ వదనము

నతికి ముదమున  గణపతి నాద రించె

వెంకటప్పయ్య

 

 

నలుగు పిండితో వెలసెను నందనుండు

నాగ హరుని వలదని తాన డ్డు నిలిచె

శివుడు కోపము గనతని శిరము నరికె

తనయుజూసిన తల్లియు తల్లడిల్లె.

Ramreddy

 

1.ఇరువురి సహోదరులు మధ్య యిచ్చ గల్గె

గణముల యధిపతిగ నుండు ఘనత కొరకు

ముజ్జగంబుల పావన పుణ్యనదుల

యందుయెవరున్ మునకలేసి ముందుగాను

 

2.  వచ్చిరేనివారే యధిపతిగ యయ్యె,

యనిన శివునాజ్ఞ వినినంత జనిరి యపుడు

 నెమలి వాహనం బెక్కియున్ నెనరు తోడ

కార్తికేయుడు వెడలెను కాంక్ష గల్గి

 

3.గణపతి తపంబు జేయుచున్ కరుణ గల్గు

 మంత్రముజపించి మ్రొక్కెను మార్ద వముగ

తల్లిదండ్రులే దైవముల్ దలచి   యుండి

వినయ చిత్తుడై గెలుపొందె విఘ్న రాజు

రాచపూడి జయ సుశీల

  

తేటగీతి

పిండి బొమ్మను చేసియు పింగ తాను,

ప్రాణమున్ బోసి గవనిలో ప్రాపు నుంచ,

శివుడు లోనికేగుచునుండ శిశువు వచ్చి

అడ్డగించ, కోపమునను హరుడు తనదు

శూలమున దునిమి చనెను చోద్యముగను.

 

పింగపార్వతి,    గవను- ద్వారము

దాక్షాయణి

 

తేటగీతులు

1. పార్వతి నలుగు పిండితో ప్రతిమ నోర్చి

ప్రాణమును బోసి వాకిటన్  బాలు నుంచె

అసుర సంహారమును చేసి హరుడు వచ్చె

అడ్డగించినట్టి  తలను యతడు నరికె

 

2. పార్వతమ్మ బాధను గని పరమశివుడు

గజ శిరసు యతికించెను గజముఖునికి

అన్నదమ్ముల పోటులో యతడు గెలిచె

సకల  కార్యంబు లోనర్చె   స్వామి యయ్యె

మంత.సక్కుబాయి

 

తే.గీ.

నలుగు పిండితో ప్రతిమను నగజ చేసి

ప్రాణమును పోసి నతనిని బయట నిలిపె

చనియె స్నానము కొరకును సంతసముగ

శివునియాపిన బుడతడి శిరము ద్రుంచె

అంబభాదను జూసితా నాగ్న జేసి

పద్మి శిరసును తెచ్చియు ప్రాణమిచ్చె

  కర్చర్ల సత్యనారాయణ

నగజ=పార్వతి,    పద్మి =ఏనుగు

 

 

పత్రి గణపయ్య నేనీకు ఫలము తెచ్చె

పిండి వంటను వండితి ప్రీతి గాను

ఆరగించవయ్య నిపుడు హాయి గాను

శరణు జూపుము నాఫైన శంకరసుత

సూర్య తాడిపూడి

 

 

తే.

నలుగు పిండి తోడ శిశువున్ నగజ కూర్చి

ప్రాణము నొసంగి శాలకు రక్షణగను

జేసినంత, భూరి గృహము జేర శిశువు

యడ్డగించె, యుద్రేకుడై హరుడు శిశువు

తల నరికి జనెన్, సతితోడ తన్మయునిగ

నుండ శిశువు ప్రస్తావన నుచ్చరింప

జరిగిన ఘటనతో చండి సమధికముగ

గోడు జెందినంత, భవుడు గుమిలిపోయి

గజముఖము గూర్చి యోదార్చె; కరివదనుడ

నెడు ప్రవరమున గణపతి నెగడు చుండె

 

నగజ= పార్వతి,   శాల= గృహము,   భూరి, భవుడు = శివుడు

వెంకట్.సి హెచ్

 

 

తల్లి తండ్రులే ప్రథమ దైవమని తలచి

షణ్ముఖుని కంటె భక్తితో శరణు కోరి

ప్రణుతులర్పించి పోటిలో భవిత చూపి

పార్వతి సుతుడందు కొనును ప్రథమ పూజ

భీమవరపు జ్యోతి

 

 

నలుగు పిండితో చేసెను నతివ తాను

తల్లి చేతిలో జన్మించె తనయు డతను

శివుని ఎదిరించి నిలిచెను చిరుత లాగ

ప్రాణ ములుతీ సె శంభుడు పోరు సలిపి

రుక్మిణి శేఖర్

 

 

నలుగు పిండితో బొమ్మకు నాంది పలికి

ప్రాణమును నింపి పురుహూతి,వారమందు

ఏకదంతుని జంపగ నీశుడు,గిరిజ

తపన నణచ నతుకు పెట్టి దంతి ముఖము

పేరిడెను గజాననుడని పేర్మి తోడ.

సుమలత

 

 

తొలుత గణ నాధ  నిను వేడి తోయముగను

విద్య నేర్వగ తలచితి వినతి తోడ

పద్య రచన యందు సతము పథము చూప

శుభము కలిగింపు గజముఖ శుద్ధి తోడ

 

సతతము నిను మది గొలుతు శరణు శరణు

తలచిన పనులు నెరవేర్చ తరలి రమ్ము

మనసు నిలిపిన నీ నామ మహిమ తెలియ

సిద్ధి బుద్ధుల నొసఁగుము చింత దీర్చి

 

నలుగు బొమ్మకు ప్రాణము నగజ బోసి

బాలుని దరి కై పనిగొని వనము కేగె

నీల కంఠుని బాలుడు నిలువరించ

కసరు గొని బాలుడి తలను కనుపు గొట్టె

విషయము నెఱిఁగి పార్వతి వెగడు బడగ

మెలపు తోడ శివుడు గజ మినుకు దాపి

గణపతిగ నియమించెను గంగ ధరుడు

హిమ రాణి

 

 

తేటగీతి

1.

బొమ్మ గణపతి చేసియు అమ్మ తల్లి

మురిసి పోవుచు అంబిక ముదము తోడ

బిడ్డ నుంచియు కాపల అడ్డ ముగను

శివుని రానీయ కుoడిన శిరము పోయె తుంచె

 

2.

గణము లకదిప తినిచేయ ఘనుడు కొరకు

పోటి పెట్టెత నయులకు పోవు ముందు

శరవ ణుడుకాని గణపతి శరము వోలె

వేగి రముగాను వచ్చెరా వేద విభుడు

 

3.

తల్లి దండ్రుల చుట్టును తాను తిరిగె

విఘ్న నాయకు డయ్యెను వీరు లకును

విఘ్న ములనన్ని తొలగించు విన్న వించ

జనుల కందరి కీయవ జయము లన్ని

లలితారెడ్డి

 

తల్లి పార్వతి చేయగ తనకు రక్ష

కుడిగ యడ్డగించగనాశివుడిగణములె

శిరము ఖండించె కోపమున్ శీఘ్ర గతిన

బాధ నోర్చగజాసుర పాలి తెచ్చి.

పాలి - శిరము

తాండవ కృష్ణ

 

నలుగు పిండికి ప్రాణంపు వెలుగునింపి

పార్వతి గణపతికి జన్మ పంచి వాకి

టననిలపకావలిగనుంచుటనెరుగకనె

హరుడు తననాప క్రోధియై హతము జేసె

అనూరాధ

 

 

పార్వతి మలచిన నలుగు బాలుడతడు

దండ్రి శివుని వరముచే యతడు గజముఖు

డాయె! బుద్ధిమతిన్ యతడాయె గణము

లకు యధిపతి గణపతిగా భ్రాత స్కాంద

గర్వముణణచి! స్వామీ! సకల గుణముల

రాశియగు నీకు మ్రొక్కెద! ప్రమథ నాథ!

సునీత మూర్తి

 

తేటగీతి

1.

పసుపు ముద్దకు ప్రేమతో ప్రాణమిచ్చి

రక్ష జేయగ బాలుని వాకి టుంచి

స్నాన మాచరించ జనియె శైల పుత్రి

వినుము గణపతి జననము విజయ నోట

 

2.

అసురు   పరిమార్చి యేతెంచె యంబ విభుడు

శంభు నడ్డగించె శిశువు జంకు లేక

కుత్తు కనుగోసె ను భవుడు క్రుద్ధు డగుచు

వినుము గణపతి జననము విజయ నోట

 

3.

గౌరి దుఃఖించె కొమరుని గతిని గాంచి

గజము( గజాసురుని ) శిరమును నతికించి యాయు విచ్చి

సంతసమును గూర్చె సతికి సాంబ శివుడు

వినుము గణపతి జననము విజయ నోట

విజయ

 

 

పిండి బొమ్మను జేసెను  ప్రీతి తోడ

ప్రాణమొసగి పరవశించె పార్వతమ్మ

కాపలా నుంచె తనయుని గడప ముందు

అడ్డగించెను బాలుడు హరుని జూసి

కోపముతొ  తల నరికెను కోకనదుడు

వొడ్నాల  స్వప్న

కోకనదుడు = శివుడు


 

నలుగు తోడను ప్రతిమను మలచి నగజ

ప్రాణమును బోసి స్వజునిగ పరిగణించి

దారము కడ కావలి నుంచ దారకుండు

నడ్డగించె గజాసురు నడచి వెండి

కొండ కేతించిన హరుని, కుపితుడైన

విన్న పార్వతి విలపించ పింగళుండు

దంతి మస్తకము నతికి దారకుడికి

గజముఖుడను నామమొసగె గాములదొర

యనుజుని గెలిచి గణపతి యై వెలిగెను

 అవళూరు సీతమ్మ

 

 

తేటగీతి

నలుగు పిండితో బొమ్మకు నాంది పలికి

ప్రాణమును నింపె పురుహూతి,ద్వారమందు

ఏకదంతుని జంపెగా నీశుడు,గిరిజ

తపన నణచ నతుకు పెట్టి దంతి ముఖము

ఏకదంతుని పాదము    లో గణ భంగము

పేరిడెను గజాననుడని పేర్మి తోడ.

అయితి సుమలత

 

 

వినాయకోత్పత్తి-వినాయక విజయము-తద్విదిత నీతి

తేటగీతి మాలిక

(షష్టీ వింశతి పాద సంయుతము)

శ్రీహరి గజాసురుని జంప, శివుడు వాని

యుదరకుహరమునుండి విడుదల పొందె ;

భర్త విషయము వినినంత, పార్వతి ముద

మంది, యభ్యంగన స్నానమాచరింప,

నలుగు పిండినే బాలుగా మలచి, ప్రాణ

మొసగి, వానిని వాకిటనుంచె గాపు ;

సంతసముగ లోనికినేగు సాంబశివుని

నిలువరింప, నా బాలుని దలను ద్రుంచె

శివు;డది యెరింగి శాంభవి చింతిల గని

భరవు, యగ్గజాసుర ఘన శిరము నతికి,

చిఱుతను మరల బ్రతికింప జేసెనపుడు ;

నాతడొప్పె "గజానను" డంచునిలను ;

కుసుమశరు మిషను, గనిరి కొమరునొకని

పార్వతీపరమేశులు ప్రణయమొప్ప ;

నాతడే "స్కందుడు", గజాననానుజండు !

ప్రమథ గణములపై నాధిపత్యమునకు

జరిగె స్పర్ధ స్కందునకు, "గజముఖు"నకును ;

తల్లిదండ్రులకు "బ్రమరి"- తనకు గెలుపు

నీయ, దమ్ముని నోడించి, యెంపికయ్యె 

ప్రమథసేనలకు బతిగా ; ప్రథముడయ్యె

పూజలందుకొనంగ నీ పుడమియందు !

విఘ్నములకధినాథుడై  విభవమంది,

యేలె "విఘ్నేశు"డను పేర నిలను జనుల !

తల్లిదండ్రులే ప్రత్యక్ష _దైవము లని,

దానె నధికుడననెడి మదంబు వర్జ్య

మనియు బోధించె గణపతి మనుజ తతికి !!

భరవు = శివుడు,   ,కుసుమశరుడు = మన్మథుడు,   స్పర్ధ =పోటీబ్రమరి(విశేష్యము)= ప్రదక్షిణము

( షష్టీ వింశతి.ఇరువది యారు)

వట్టెం వెంకట రమణ

 

 

నలుగు పిండిని ముద్దగా నలచిజేసె

ప్రాణ మునిలిపి బొమ్మలో పార్వతమ్మ

గణపతిగపేరు బెట్టియు గట్టుచూలి

చూచి మురిసె నందనుడికి జోలపాడి

 

నలుగు బిండితో పార్వతి నందనుడిగ

గుమ్మమందున కాపలా గుజ్జువేల్పు

నడ్డ గించెను నీశుని నాయకుడుగ

కోప మునరుద్రు డుదునిమె కూటకృత్తు

 

విఘ్న నాయక వధజూచి విరియబోడి

వలవ లవిలపిం పగజూచి వాజసనుడు

గజము ముఖమునతికితాను గట్టుతాల్పు

మహిమ జూపుచు పత్నికి మారజిత్తు

గీతాశైలజ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు