20, అక్టోబర్ 2020, మంగళవారం

సమస్యాపూరణము

10 కామెంట్‌లు:

  1. 24, మార్చి 2017, శుక్రవారం
    శంకరాభరణము బ్లాగులో
    మొదటి సమస్య

    1)నారాయణ యనిన నరుడు నరకము జెందున్ 24 మార్చి 2017
    కం: చేరెను వైకుంఠమునకు
    నారాయణ యనిన నరుడు ,నరకము చేరెన్
    జారుడు హరీ అని అనక
    మారక సమయమున వాని మగువను తలచన్

    రిప్లయితొలగించండి
  2. అమృతపానమ్ముచే సుర లసురులైరి" 25 మార్చి
    తపసి స్త్రీలను మోహించె దహనుడు, ఋషి
    సతిని కూడినా డింద్రుడు సంత సముగ,
    అవని ధర్మమ్ము వారికి ఆవహించ
    అమృత పానముచే సురలసురులైరి

    రిప్లయితొలగించండి
  3. 3 భక్తుని బూజింపవచ్చె భారతి తానే 26 మార్చి 2017
    భుక్తికి సముచిత ఆర్ధిక
    శక్తిని పోతన కీయుము సాగర పుత్రీ,
    ముక్తినిడుము రయముగ , అని
    భక్తుని పూజింప వచ్చెభారతి తానే

    రిప్లయితొలగించండి
  4. 4 పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్ 27 మార్చి2017
    కం: వెడలెను ఇలపై ఖద్యో
    తుడనుచు పార్ధుడు రయముగ తూణము వీడన్
    సడలగ కృష్ణుని చక్రము
    పడమట, నుదయించెను రవి పద్మము లేడ్వన్
    సైంధవ వధ వృత్తాంతము ,.

    రిప్లయితొలగించండి
  5. 5.విషముఁ ద్రాగె హరియె విందటంచు..28 మార్చి2017
    జగము బ్రోచుటకును శంకరుం డానాడు
    విషము ద్రాగె; హరియె విందటంచు
    ముదముతోడ దాల్చి మోహినీ రూపము
    నమృతమును సురలకు నందజేసె.

    రిప్లయితొలగించండి
  6. 7 గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్ 29 మార్చి2017
    కం: హరి వానరగుమితో ఉలి
    మిరి కట్టదలచి వందనమిడ, వేగముగా
    దరిచేరు చున్నఆ సా
    గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్

    ఉలిమిరి = సేతువు వానర గుమి = వానరమూక

    లంక దాటుటకు వానరమూకతో సేతువు కట్టదలచి శ్రీరాముడు సముద్రమును ప్రసన్నత కోరుచు మనసులో వందన మిడగా సముద్రుడు వెంటనే దర్శన మీయ శ్రీరాముడు వేగమే వందన మిడెను
    మీ ప్రయత్నం ప్రశసార్హం. కాని 'వానరగుమి' అనడం దుష్టసమాసం. 'ఉలిమిరి' అంటే వృక్షవిశేషమని నిఘంటువులు చెప్తున్నవి. సేతువు అన్న అర్థం లేదు. రెండవపాదం మూడవ గణం నలం కాని జగణం కాని ఉండాలి. మీరు భగణం వేశారు. 'సాగరుని' అనడం సాధువు. 'సాగరుడుని' అనరాదు.
    మస్కారములు రెండవ పాదములో పొరపాటు జరిగినది. క్షమించండి. వానరగుమి దుష్ట సమాసమని తెలియక వాడాను. శ్రీ శబ్ద రత్నాకరము (బహుజపల్లి వారిది) 939 వ పేజిలో సేతువు అన్న నీటి కట్ట, ఉలిమిరి అని వున్నది. అందువల్ల ఉపయోగించాను. సాగరుడుని అని వాడకూడదని తెలియదు. సరిదిద్దు కొంటాను. పూసపాటి కృష్ణ సూర్య కుమార్

    రిప్లయితొలగించండి
  7. 7 నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్"
    నీరము భార్య పోయగ మునీంద్రుని పాద ద్వయంబు రాముడున్
    కూరిమి యొప్పగా కడిగె, గొంతుకు గంధము పూయ సోదరుల్,
    హారతి నిచ్చి మువ్వురును, హర్షము కూర్చెను కోసలాంగనల్
    నారద మౌనిముఖ్యునకు, నల్వురు భార్యలతి ప్రసన్నులున్

    రిప్లయితొలగించండి
  8. 8 పార్థుఁ డర్జునునకు బావ మరిది 2/4/17

    ఆ: దేవకీసుతుండు, దేవతా శ్రేష్టుoడు,
    చక్ర ధారి, ఘన పరాక్రముండు,
    రుక్మిణీ ప్రియుండు, రోచిష్ణువుండైన
    పార్థుఁ డర్జునునకు బావ మరిది

    పార్ధుడు = కృష్ణుడు

    రిప్లయితొలగించండి
  9. 10 తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె 3/4/17
    తపసి ఘన పాదములకు వందనముచేసి
    హరుని విల్లును సులువుగా విరిచి జనక
    పుత్రి , చల్లని చూపుతో ధాత్రినేలు
    తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  10. 11 నీచ దశనంది సజ్జనుల్, నీల్గుచుంద్రు 4/4
    పాండవులు పడెనానాడు బాధలన్ని
    రాముడు పడెనిక్కట్లను భామ కూడి
    వసుధ లోన పుణ్యపురుఘుల్భంగపడక
    నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు

    రిప్లయితొలగించండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు