28, అక్టోబర్ 2020, బుధవారం

 ఈనాటి తెలుగు తేనియలు‌

సమస్య. 

శరదృతు వెన్నెల ప్రియునికి సంకటము కదా

ఇచ్చిన పాదము  కందము  నా పూరణము  

సీసములో

రాముడు సీతా వియోగము తో బాధ పడు సందర్భము

చెట్టుపై నున్నట్టి చిలుకల జంటలు గూళ్ళకు‌ చేరెగా కువకువలను

సలుపకన్,వర్షంపు జలముతో జలపాత‌పు లలన‌ భూమిని ముద్దు పెట్డ

దలచి దుముకు చుండె జలజలా ఖలము పైకిన్, కపోతంపు యు‌గళము లన్ని

గురుగురు మనుచుండె కొమ్మల‌నడుమన,చటకములు కిచకిచమని రవము

లేమియు చేయక కామిత ములుతీర్చుకొనుచుండె, నాకసమ్మున చిరు‌ జల

దములైన  లేకుండ తారకావిటుడు ప్రకాశించెడి ధవళ‌ కాంతుల‌ నులి

వెచ్చని శరదృతు వెన్నెల ప్రియునికి సంకటము కదా, యిషణము నాప

కష్టమగుచుండె ,సీతలేక  మనుటెంత

దుర్భ రంబునో గద, పత్ని తోడు  లేని

జీవితంబు వ్యర్ధముగదా,చెప్పు చుంటి

వినుము‌ లక్ష్మణా యని రాము డనెను వనిన

లము  = నేల,

చటకము  = ఊర పిచ్చుక

జలదము = మేఘము

తారకా విటుడు =  చంద్రుడు

ఇషణము  =  కోరిక 

2 కామెంట్‌లు:

  1. సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
    ఛందస్సు : మీ ఇష్టం
    భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
    మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
    అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
    పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
    ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
    మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
    గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
    send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
    Whats app : 9490702244

    రిప్లయితొలగించండి
  2. సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
    ఛందస్సు : మీ ఇష్టం
    భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
    మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
    అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
    పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
    ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
    మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
    గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
    send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
    Whats app : 9490702244

    రిప్లయితొలగించండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు