20, అక్టోబర్ 2020, మంగళవారం

చిత్ర బంధకవిత్వము

 చిత్ర  బంధకవిత్వము

1 కామెంట్‌:

  1. రధ బంధ సీసము
    గణేశ స్తుతి
    పద్యము చదువు విధానము:
    ఇది బంధ కవిత్వము లో నా మొదటి పద్యము. శ్రీ వినాయక స్తుతి తో బంధ కవిత్వము వ్రాయటము మొదలు బెట్టాను. పైన ( శం) దగ్గిర మొదలు బెట్టి శాంకరి అని చదివి (కొమరా) అని కుడి ప్రక్కకు మరల ఎడమ ప్రక్కకు చదువు కుంటు సాగాలి దీని లో విశేషము మధ్య గడిలో (శంకరా భరణం కవులకు వినాయక చవితి శుభాకాంక్షలు) అని వస్తుంది. ఇది చాలా కష్టమైన బంధము.

    సీ: శం, శాంకరి కొమరా, చంద్ర చూడ శుభ తనయ, బొజ్జ దేవర, నాగ సూత్ర
    ధర, వారణంపు వదన, నిత్య మోదక వాంఛితా, పరమేష్టి భావుక, గణ
    నాధా, ఎలుక వాహనా, కుమారాగ్రజా, విలసితంపు వదనా, విఘ్న రాజ,
    సుప్రదీపుoడా, శుభప్రదా, జిష్ణవే, యేకదంతా, సర్వలోక నాధ,

    తే: చదిర వీక్షితా, భువిజన సమ్మతి విత
    రణ, శుభ ప్రదాత, వ్యాస భారత విధాత,
    యెపుడు కాంచుచు, తప్పుల నెప్పుడు క్షమ
    చూపి దీనుల బాధలు బాపు మయ్య!
    కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్
    24/8/2017

    రిప్లయితొలగించండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు