20, అక్టోబర్ 2020, మంగళవారం

నా ఇతర రచనలు

నా ఇతర రచనలు

3 కామెంట్‌లు:


  1. శ్రీ వినాయక

    హేవిళంబి ఉగాది పద్య మాల
    తే: చైత్ర మాసంపు చెంగావి చీర కట్టి,
    కంచుకమ్ము వైశాఖమ్ము ఎంచి ఈయ,
    జ్వేష్ట ఆషాడ మాసంబు లిష్ట పడుచు
    గాజుగమ్ములై ముంజేల కాంతులిడగ,

    తే: శ్రావణపు కుంకుమ నుదుట సౌఖ్య మీయ,
    భాద్రపదపు ముక్కెర నీకు భాగ్య మిడగ,
    కర్ణములకు ఆశ్వయిజము కార్తికములు
    కమ్మలై శోభ నంబుగా అమరి పోవ,

    తే: మార్గశిరము కంఠమ్మున హారమొసగ
    పుష్య మాసమ్ము పాపట పొంత చేర,
    పసిడి బిళ్ళతో జడమిసమిసలుగొలుప
    మాఘ ఫాల్గుణ మాసముల్ నీ ఘనమగు


    తే: చరణ దోయికి గజ్జెలై శిరము వంచ,
    ప్రతి పదాది తిధుల పూలబాట నడుమ,
    అశ్వనీ తారకలు శ్వేత హయము లన్ని
    ఆరు రుతువుల బంగరు తేరు నడుప

    తే: పుల్ల మావుల సిగ్గు దోబూచులాడ,
    వేప పూచిరు నగవుల్ విందు చేయ
    ఉదయ భానుని కిరణాలు సుందరముగ
    భువికి చేరు సమయమున హేవిళంబి

    తే: కన్నియా వచ్చుచుంటివా కాంతు లిడుచు
    తెలుగు ప్రజలకు ఘనముగ మేలు చేయ,
    తెలుపు చుంటిమి ఎల్లరం చెలిమి తోడ
    స్వాగతంబులు నీకు సుస్వాగతంబు

    పూసపాటి కృష్ణ సూర్య కుమార్



    సాహితీ సార్వభౌములకు హేవలంబి ఉగాది శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. [21/10, 21:14] PKSKumar: *22-10-2020 (గురువారం)*
    *సమస్య – 3522*
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
    *“పులులు మేకలు నొకరేవు జలముఁ ద్రాగు”*
    (లేదా...)
    *“పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా”*
    http://kandishankaraiah.blogspot.com
    [21/10, 22:11] PKSKumar: వ్యాఘ్రములనగ నేమొకొ, వనము లోన

    చింబులని వేని నందురు, చెప్పు‌శుక్రు

    నకు కనుల సంఖ్య యెంత,రజ కులు వస్త్ర

    ములుతుకు స్ధలమేమిటొ, తెలుపు జీవు

    లేమి చేయు దప్పి కలుగ భూమి పైన,

    పులులు,మేకలు,నొక,రేవు, జలము ద్రాగు.

    రిప్లయితొలగించండి
  3. 44/108 22/10/2020


    मारीचार्तिकृदाशुग राम् ॥४४॥
    Maariica-[A]arti-Krda-[A]ashuga Raam ||44||
    44: I take Refuge in Sri Rama, Who inflicted Pain on Marica with His Arrow for his (Marica's) wrong deed.



    మారీచార్తికృతాశుగ రామ

    నీదు శరముతో మారీచుని పడగొట్టి
    వెక్కసమ్ముగ బాధను పెట్టి నట్టి
    రామ సతతము నిన్ను శరణము కోరి
    పూజ జేయుచునుండె నీ పూసపాటి
    వెక్కసము = అధికము

    రిప్లయితొలగించండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు