25, అక్టోబర్ 2020, ఆదివారం

దసరా పండుగ సందర్భముగా సమూహ సభ్యుల రచనలు 25.10.2020

 


తేటగీతి

సర్వవిధ సిద్ధుల నొసంగి సాతమిచ్చు

సిద్ధిధాత్రి దుర్గాదేవి! సింహ వాహి

నిగ నభయమిచ్చు భగవతీ! నిష్ఠతోడ

కొలవ గమృతపదమొసంగు కొండచూలి!

మమ్ము గాంచి రక్షింపు సమధికముగను

వెంకట్. సి. హెచ్ 



శమి నాడువే డెద నిన్ను దయను జూపు
కల విద్యల నొసగెడి శారదాంబ
రా జ రాజేశ్వరి , భవాని , లలిత సకల
శు భములనిడుము గాయత్రి !జోగులాంబ ,
భా ర్గవి మలయవాసిని , బ్రహ్మ విద్య
కాం తు లొలికెడి నయనాల కరుణ చింద
క్ష యములేని యశము నిచ్చి కవన కాంతు
లు వెలుగ తెలుగు వనము లోన నిలువు

రమాదేవి



శుభము కలుగుగ దశమిన శుభ్ర ముగను
గురువు మెచ్చిన పద్యము కూర్చ గలము
నేర్చె విద్యలు పలువురు నేర్పు తోడ
విజయ పధమున పయనించ విద్య నందు.

తాండవ కృష్ణ, ముంబయి





ఈనాటి శంకరాభరణం వారి సమస్య

దసరా సరదాలు మనకు దప్పె గటకటా

                           (లేదా)

దసరాపండుగ నాటి పెక్కు సరదాల్ దప్పెన్గదా దైవమా

 

నాపూరణ  కందము లో 

 

దసరా పద్యపు సొగసులు
 
వెసనళ్ళుళ్ళగుసగుసలు వివరించంగా

పసలేదిక కోవిడుతో

దసరా సరదాలుమనకు దప్పె గటకటా

 


2 వ పూరణ  మత్తేభము లో 

 

దసరా పద్యము లుచ్చరించు సరదా తాలేదికంజూడగా

మిసిమిం దూగుచు పాడుచున్ బ్రతుకు సమ్మేళం బులేమా యెనో

పసలేకుండగ బోయెనొక్కొకనగా పర్వంబులీరీతిగా

దసరాపండుగ నాటి పెక్కు సరదాల్ దప్పెన్గదా దైవమా

ఆదిభట్ల సత్యనారాయణ





మలివయసులోన విద్యను మనసు బెట్టి

నేర్వ దలచి చేరితిరిగ  నెమ్మి తోడ

తెలుగు మొలకన్ మీరెల్ల, తెలివి దాగి

యుండు నెల్లరి మనమున మెండు గాను,

కొలది యత్నము చేయంగ వెలుగు లిడును

సాహితీ దీపమెప్పుడు సరస గతిని

పత్తి తోడను వత్తులన్  పదిల పరచి

మంచి నూనెను కొంచెము కొంచెముగను

వంచుచున్ దివ్వెలను వెలిగించు గాదె

గురువు నెప్పుడు, ఙ్గానమున్ కొసరి కొసరి

నేర్పు తోడ మీరెల్లరున్ నేర్చు కొనిన

సాహితీ వెలుగులు కాంచి సంత సముగ 

గగన పధమున కీర్తిని‌‌ ఘనత తోడ

నిలుప గలరు మీరెల్లరున్ చెలిమి‌ తోడ

వేల కోర్కెలు తీర్చుయీ విజయ దశమి

సుఖము సౌఖ్యము నిడు మీకు శోభ తోడ


పూసపాటి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు