ఆందోళికా
బంధ తేట గీతి , దేవి
ప్రార్ధన
ఆందోళిక
(పల్లకి) బంధము చదువు విధానము ఎడమ ప్రక్కన పైనుంచి (మాత)దగ్గిర నుంచి మొదలు
పెట్టాలి.చివర కుడిప్రక్క పాదము వద్ద గల (మమ్ముగాచవలయు) తో ముగించాలి పసుపు పచ్చ రంగు గల అక్షరములు 1 కన్నా ఎక్కువసార్లు వస్తాయి శ్రీ
గౌరి, మారి,గిరిజ అని చదువు కుంటూ
వెళ్ళాలి భీమ, యగజ, దుర్గ, అని చదువుకున్న
తర్వాత ఎడమ ప్రక్క శ్రీ మాతృక నుంచి మొదలు బెట్టాలి తర్వాత కుడి ప్రక్క మలయ వాసిని వద్ద నుంచి మొదలు బెట్టాలి తర్వాత క్రిందకు
వచ్చి మాలిని దగ్గిర నుంచి చదివి దశభుజ నుంచి చదువుకోవాలి దేవికి అనేక రకములైన
నామములతో ఈ బంధము రూపొందిచ బడినది
మాత!మంగళ!శ్రీగౌరి!మారి!గిరిజ!
బాల!కాల!లలన!సీత!భవ్య!లంభ!
రంభ!శాంభవి!ఉమ!రమ!రామ!భీమ!
అగజ!దుర్గ! శ్రీ మాతృక!అంబిక! జయ!
మలయ వాసిని!శారద!మాలిని!కళ!
భార్గవి!శివ!సరస్వతి!భంజ!శాక్రి!
సౌమ్య!దశభుజ!సావిత్రి!శక్తి!శాంతి!
నీలలోహిత!రక్షి!సని!సురస!భయ
నాశిని!యమున!మలయమ్మ!నంద!సతము
కరుణతో జూచుచూ మమ్ము గాచ వలయు
కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్,9/11/2017

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి