దసరా సందర్భంగా త్రిమాత ప్రార్ధన
హార బంధ తేట గీతి
పద్యము చదువు విధానము : హారము మధ్యలో ఉన్న అక్షరములు మూడు సార్లు వచ్చు నట్లు బంధించ బడినవి ఈ హార బంధ విశేషము. ఎడమ ప్రక్క నున్న( గౌ) తో మొదలు బెట్టాలి. గౌ(రి),మా(రి),గి(రి)జ
యని చదివి బాల కాల లలన అని సాగి పోవాలి.చివరగా
(చపల దగ్గిర ఆపి కొస లొ గల సతతము కాచగ వలయును తల్లు లార
అని ముగించాలి
సందర్భములో వ్రాసినది
తేటగీతి
గౌరి!మారి! గిరిజ! బాల! కాల!లలన!
కాంతి! అంతకాంతక సతి! శాంతి!జ్యోతి
దాత!జయ!జలజ సదన! ధన కనక స
మస్త మహిమ దాత!రతి! రమ! రసన!సని!
సత్య! సత్తి!లంభ!ప్రభ! శాంభవి! ఉమ!
భీమ! రామ! నగజ!భంజ! బీజ!సత్రి!
చండి! చండ! చండిక! చర్చ! చల!చపల! స
తతము కాచంగ వలయును తల్లు లార!
చిత్ర బంధ కవి:
పూసపాటికృష్ణ సూర్య కుమార్
22/10/2020

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి