21, అక్టోబర్ 2020, బుధవారం

మథు మక్షిక చిత్ర సీస బంధము - శివుని ప్రార్ధన

 




మథు  మక్షిక  చిత్ర  సీస  బంధము     శివుని  ప్రార్ధన 

అక్షతుడు!ధ్రువుడు!!హరకుడు!బాల (ద) ర్శనుడు!వృషాంకుడు!శమనరిపుడు!

అజితుడు!ఖట్వాఁగి!అంబర కేశుడు!!(స)ర్గుడు!సుబలుడు!శశివకాళి!

అచలుడు!గోపతి!అంధకా రాతి!పు  (రా)రాతి !భూరి!!పురారి!హృత్వ!

అజుడు!ఉమాపతి!ఆబోతురౌతు!ఈ (శు)డు! స్వామి!కృత్తివాసుడు!విలాసి!

అనిరుధ్ధుడు!ఉదర్చి!అంగజహరుడుస (భా)వనుడు!భృగువు!పంచముఖుడు!

అఖిలగురుడు! శార్ఙ్గి! అయుగనేత్రుడు!అంత(కాం)తకుడు!కపాలి!ఖరువు!జ్వాలి!

అనలాంబకుడు!శూలి!అంబరీషుడు ద(క్ష) జాపతి!నకులుడు!సర్వకరుడు

అక్షరుడు!చండుడు! హంసుడు! ఫా(లు)డు!!నెలదారి! పెనుజోగి! నీలగళుడు


విషధరుడు!!విషమాక్షుడు!విశ్వమూర్తి !

మరునిసూడు!మలహరుడు!మదన రిపువు! 

తెలుగు తేనియల్ కవులకు దీవెన లిడి 

కాచు చుండును సతతము కరుణ తోడ 


ఇది మధుమక్షిక  చిత్ర సీస బంధము    శివుని  ప్రార్ధన    మధ్యలో ఉన్న  (అ) అక్శరముతో   తేనెటీగ కుడిరెక్క  అనగా మనకు ఎడమ ప్రక్క  నుంచి మొదలు పెట్టాలి   (అక్షతుడు)  దగ్గర  మొదలు పెట్టి చవువుకోవాలి. ఒక పాదము అయిన తర్వాత  ఇంకొక పాదము వరుసగా  నాలుగు పాదములు చదివి తేనెటీగ ఎడమ ప్రక్క గల (అనిరుధ్దుడు) తో మొదలు పెట్టలి.  ఆలా రెక్క మొత్తము అయిన తర్వాత   నడుము భాగములో   (విషధరుడు)  అని చదువుకోవాలి   చివరి పాదము  (తోడ) తో  ముగుస్తుంది.

దీనిలో విశేషము  ( అ)  అక్శరముతోటి  సీసము ఎనిమిది పాదములు మొదలు అవుతాయి. ఇంకొక విశేశము రెక్కల చివర్లో  (దసరా శుభాకాంక్షలు)  అని వాక్యము  పద్యములో  బంధించ బడినది. 

 నడుము చివర     (తెలుగు తేనియల్ కవులకు దీవెన లిడి  కాచు చుండును సతతము కరుణ తోడ)  అన్నది  ఉన్నది. 


చిత్ర బంధ కవి 

పూసపాటి కృష్ణ సూర్య కుమార్  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు