24, అక్టోబర్ 2020, శనివారం

చిత్ర బంధ కవిత్వము

 

భేరి చిత్ర బంధ సీసము లో శ్రీకృష్ణ ప్రార్ధన

పూతన పాతంగి! నాతిరక్షక! త్యభామ  మానస చోర!  పార్ధ సార

ధీ!గిరి ధర! వసుదేవ సుత!  కరటి ప్రాణ దా! వనమాలి!   భద్రనాధ!

చిరజీవి!   బకవైరి!   శ్రీపతి!   భాస్కర   నేత్ర!  వజ్రకిశోర!   నీరజోద

రా!దీనబంధు! మురారి! కంసారాతి!  మల్లారి!నగరా! నల్లనయ్య!

నరకాంతక!మల నాభ! నటన సూత్ర ధారి!విశ్వంభరా! దానవారి!

దేవకీ సుతా! యవనారి! తీర్ధ కరుడ!

సూరి! బాహు భేది! భరిమ!సోమ గర్భ! 

భూరి!  చక్రధారి!  కపిల! పుష్కరాక్ష!

కాచు పూసపాటి నెపుడు  కరుణ తోడ

 

పై పద్యములో భేరి  పైన (పూసపాటి చిత్ర బంధ కవితా భేరి) అన్న వాక్యము బంధించ బడినది                            

                                           చిత్ర బంధ కవి  పూసపాటి కృష్ణ సూర్య కుమార్      9/8/2018







 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు