శ్రీ బదరీవాస! సింహయాన! యమున! శ్రీ కప్పు టైదువ! సింధు కన్య!
శ్రీ శక్తి! మలయవాసిని!చలిమల చూలి! శ్రీ జగజ్జనని! ఐశి! నగ జాత!
శ్రీ అగజాత! ఈశి! సనాతని!గిరిజ!శ్రీ మాతృక! పలుకు జెలి! భగవతి!
శ్రీ ప్రభ! బహుభుజ! శివవల్లభ! భవాని!శ్రీ కాలక! కిరాతి! శివ! జలధిజ!
శ్రీ గట్టురాచూలి! శ్రీ పుత్రి! దుద్దుర! శ్రీ నీల లోహిత!శ్రీ మృడాని!
శ్రీ మేనకాత్మజ!స్త్రీ రత్నము! చపల!శ్రీ పరమేశ్వరి! శ్రీ శివాని!
శ్రీ పాటలావతి!శ్రీ భద్ర కాళిక!శ్రీ దుర్గ! సతి! మనస్విని! అనంత!
శ్రీ పింగ!పురుహూతి!,శీతాచల తనయ,!శ్రీ సినీవాలి! ఈశి!,చల!సిరి!పాత్రి!
(క)ర్వరి! ప(రు)ల! వికాశిని! బా(ణ)! నికుంభిల! స(ని)! సతి! శాంభవి! రమ
చం(డి)!నారాయణి,!సావిత్రి! (మీ)నాక్షి!మ(రు)ని జనని! (స)త్య! మా(త)! శాం(త)!
వదన!(ము)న్నీటి కన్నియ! పద్మ వాస!
(కా)లక!(చ)ల! శి(వ)ప్రియ! కలిమి (ల)లన!
(యు)క్త రూపిణి! వాక్కాంత! ముక్తి దాత!
కరుణ నిడి మీరు సతతము కాచ వలయు
ఈ పద్యము దసరా సందర్భమున ఇవాళ వ్రాసినది. చిత్రము మధ్యలో (శ్రీ) అను పదముతో సీస పద్యము ప్రారంభమగును. (శ్రీ)అను అక్షరము ను మధ్యలో బంధించబడినది. ముందుగా 1 వ రేకులోని శ్రీ (బదరీ వాస) తో మొదలు పెట్టాలి (యమున) దగ్గర ఆపి పైన ఉన్న శ్రీ తో మరల కప్పు టైదువ అని చదువుకుని క్రిందకు రావాలి సింధుకన్య తో ఆగి పోతుంది . మరల (శ్రీ)తో మొదలు పెట్టి శక్తి అని రెండవ పాదము చదువు కోవాలి అలా రేకులలో ఎనిమిది పాదములు అవుతాయి
అవి పూర్తి చేసిన తర్వాత పైన గులాబి రంగు వృత్తములో (కర్వరి) దగ్గరినుంచి మొదలు పెట్టాలి. సీసములోని రెండు పాదాలు తేట గీతి లొని మూడు పాదాలు ఆ వృత్తములో బంధించ బడినాయి. ఇక తేట గీతిలో మిగిలిన నాల్గవ పాదము చిత్రములో అంతర్లీనము గా ఉంటుంది. గులాబి రంగు వృత్తములొ మరల పసుపు పచ్చ రంగుతో చిన్న
వృత్తములు ఉన్నాయి అది చూడండి ముందుగా (క) తర్వాత (రు) తర్వాత (ణ) తర్వాత (ని) అలా చిన్న
వృత్తములలలో ఎత్తు గీతి లోని నాల్గవ పాదము బంధించ బడినది ఇవి ఈ చిత్ర బంధములో విశేషములు
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
చిత్ర బంధ కవి 25/10/20
శార్వరి విజయ దశమి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి