22, అక్టోబర్ 2020, గురువారం

చిత్ర బంధ కవిత్వము

 

అష్టా దశ దళ చిత్ర మాలిక బంధ తేటగీతి

కంజుని దయతోడ  సృష్టి జగతిని  గలిగె

కంజపానము తో పరాగమము     తొలిగె

కంజనుని వలన రతిసుఖమ్ము    కలిగె

కం హితుని వల్ల భువిపై కాంతి  కలిగె  

కంకటీకుని     వలననే    గాలి     యిలిగె

కంకణపు   కూడిక వలన  కడలి   కలిగె

కంకణి  వలననే   నాటకమ్ము      వెలిగె

కంకటీకుని    తో   కంతు  కట్టె     నిలిగె

కంకతము వలన శిరపు కచము   నలిగె

కంబళి   వలననే  చలి     గాలి     తొలిగె

కంఠము వలననె స్వరయోగమ్ము కలిగె

కం తోడనే   దేహపు  ఘనత     కలిగె

కంచు వలననే  గంటకు  క్వణము  కలిగె

కందకమ్ముతో    కోటకు    కాపు     గలిగె

కంధరము    వల్లనే    చడకమ్ము   గలిగె

కంకటము తోడ   దేహపు    గాత   తొలిగె

కంటి  వలన  జీవి  కవలోకనము    కలిగె

కంది బ్లాగుతోడ నె  చిరు  కవియు   వెలిగె



కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్  3/4/2018

అర్ధములు

కంజుడు =   బ్రహ్మ ,   కంజ పానము =   అమృత సేవనము,  పరాగమము    = చావు,  కంజనుడు  =  మన్మధుడు , కంజహితుడు =  సూర్యుడు, కంకటీకుడు =  శివుడు,  గాలి = ప్రాణము,   ఇలుగు  =  చచ్చు,     కంకణము =    నీటి బొట్టు  ,  కడలి= సముద్రము,   కంకణి   =  గజ్జె  , నాటకము   నాట్యము ,  కంతుడు = మన్మధుడు , కట్టె = శరీరము  , నిలిగు =చచ్చు,   కంకతము  = దువ్వెన     కచము  =  వెంట్రుక .     క్వణము  ధ్వని, కంధరము =  మేఘము, చడకము = పిడుగు , కంకటము =  కవచము,  గాత = దెబ్బ,  అవలోకనము =చూపు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు